రూ.80 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం
మేడిపల్లి, నవంబర్ 13 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని చెంగిచెర్ల డివిజన్(Chengicherla Division) ద్వారకా నగర్ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2, నందిని నగర్ కాలనీలలో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను(Construction works for CC) శుక్రవారం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్(Thotakura Ajay Yadav) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కుర్రి శివ శంకర్, రసాల కుమార్ యాదవ్, కొత్త సుశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.