ఘనంగా దసరా వేడుకలు-రావణ దహనాలు
ఘట్ కేసర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : దసరా పండుగను(Dasara Festival) ఘట్ కేసర్ సర్కిల్(Ghatkesar Circle) ప్రాంత ప్రజలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. దసరా సందర్భంగా ఆయా ప్రాంతాలలో రావణదహనం చేశారు. ఉదయం నుంచే ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు(Special prayers) జరిపారు. సాయంత్రం నూతన వస్త్రాలు ధరించి దసరా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురుకుల్ క్రీడా మైదానంలో జనచైతన్య సేవా సమితి(Janachaitanya Seva Samiti), స్వామి వివేకానంద(Swami Vivekananda), యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకలల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
గురుకుల్ లో జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ దంపతులు జమ్మిచెట్టుకు పూజలు జరిపి దసరా వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భారీగా బానాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం రావణదహనం చేశారు. అనంతరం జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న బందువులు, స్నేహితులను అలింగనం చేసుకుంటూ జమ్మిఆకును చేతిలో అందించి దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
అనంతరం దుర్గామాతల మండపాల వద్దకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు ప్రశాంతంగా ఘనంగా జరగడానికి అన్ని విధాలా సహకరించిన ప్రజలు, పెద్దలు, పోలీసులు, పలు యువజన సంఘాల సభ్యులకు మాజీ సర్పంచ్ యాదగిరియాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సద్దుల బతుకమ్మ, దసరా పండగల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించిన మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ కు పలు యువజన సంఘాలు, మహిళలు, జన చైతన్య సేవాసమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రజలకు దసర శుభాకాంక్షలు తెలియజేశారు.