హమాస్ భద్రతాధిపతి అబు హతం

25-11-2026 | 05:15am

మట్టుబెట్టామని ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని నెతన్యాహు ప్రకటన

జెరూసలెం, నవంబర్ 24: గూఢచార నెట్‌వర్క్(Espionage network) నడుపుతున్న హమాస్ అంతర్గత భద్రతా(Hamas's internal security) విభాగాధిపతి నయీమ్ అబు నహల్‌ను(Naeem Abu Nahal) ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళం)(Israel Defense Forces) హతమార్చిందని ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖమంత్రి కాట్జ్‌లు మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే నహల్ అంతర్గత భద్రతాధికారిగా కీలక బాధ్యతలు చేపట్టాడు.

కాగా అతన్ని హతమార్చినందుకు నెతన్యాహు ఐడీఎఫ్ దళాలను ప్రశంసిస్తూ ప్రభుత్వ విధానాన్ని భద్రతా సంస్థలు సమర్థవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. ఐడీఎఫ్, ఐఎస్‌ఏ (ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ)ను ప్రశంసించారు. ఏ ఉగ్రవాది తమ నుంచి తప్పించుకోలేడన్నారు. ఇతని మృతి హమాస్ నాయకత్వానికి ఒక పెద్ద దెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు.

మరిన్ని వార్తలు