అర్ధనారీశ్వరి అలంకారంలో గజ్వేల్ సంతోషిమాత

14-10-2026 | 08:04pm

ఒకే వేదికపై 186 మందితో బ్రాహ్మణ సుహాసిని పూజ

గజ్వేల్, అక్టోబర్ 14: గజ్వేల్ పట్టణంలోనికి సంతోషిమాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధనారీశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్రమంలో భాగంగా ఒకే వేదికపై 186మంది బ్రాహ్మణ సుహాసినిలకు మహిళలు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాష్యం చేశారు. పూజా కార్యక్రమాలలో గజ్వేల్ కోర్టు జడ్జి స్వాతి(Judge Swathi), ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు