అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని వినతి

14-10-2026 | 08:07pm

కోహెడ ఎంపీడీవోకు సింగరాయ మండల సమాఖ్య వినతి

కోహెడ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సింగరాయ మండల సమాఖ్య(Singaraya Mandal Samakhya) కార్యాలయం(ఐకెపి) పక్కన ఉన్న సర్వే నెంబర్ 1229లో తమకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఇతరులు నిర్మాణ పనులు చేపడుతున్నారని, నిర్మాణం అరికట్టాలని కోరుతూ.. మండల సమైక్య ప్రతినిధులు ఎంపీడీవో మైపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

తమ కార్యానికి సంబంధించిన స్థలానికి 2004లో ఆరు గుంటల స్థలం కోహెడ గ్రామ పంచాయతీ కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టకుండా మహిళా సంఘాలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శారద, కార్యదర్శి ముంజ మంజుల, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు, బిక్షపతి, రాజమౌళి, శ్రీనివాస్, అకౌంటెంట్ స్వప్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు