నీటిని వృథా చేయొద్దు.. పొదుపుగా వాడుకోవాలి
బాలానగర్: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని నందారం సర్పంచ్ హరిసింగ్ అన్నారు. భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు (Water Conservation).
ఈ మేరకు సోమవారం గ్రామస్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. గ్రామంలోని దిగువ ప్రాంతాల్లో నివసించే వారు తమ కుళాయిలకు తప్పనిసరిగా ట్యాపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైనంత నీటిని మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు.ఇంట్లో బియ్యాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటామో.. మిషన్ భగీరథ నీటిని కూడా అంతే జాగ్రత్తగా వినియోగించుకోవాలని హరిసింగ్ సూచించారు (Mission Bhagiratha). కరువు పరిస్థితులను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ నీటి పొదుపును దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.