గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

15-11-2026 | 12:52pm

జైనూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): జైనూర్ మండలంలోని జామ్ని, రవ్జిగూడెం గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ బాబు ముండే ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. తోటి సిబ్బంది, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు