మద్యం సేవిస్తున్న ఇద్దరిపై ఈ-పెట్టి కేసులు
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మేడిపల్లి పోలీసుల తనిఖీలు
మేడిపల్లి, నవంబర్ 18 (విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో(Public spaces) మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి సీఐ డి. జలంధర్ రెడ్డి(Medipally CI D. Jalandhar Reddy) హెచ్చరించారు. బుధవారం రాత్రి విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సీఐ జలంధర్ రెడ్డి, సెక్టార్ ఎస్ఐ ఉదయ్ భాస్కర్‌తో కలిసి చెంగిచెర్ల మేకల మండీ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న బుగ్గ మనోజ్, దర్శనం శ్రీకాంత్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కలిగే ఇబ్బందులు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.
అనంతరం ఇద్దరిపై ఈ-పెట్టి కేసులు నమోదు చేసి, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ, బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరం చేస్తామని సీఐ తెలిపారు.