బాలగోని బాలరాజు గౌడ్‌పై పోలీసుల రౌడీషీట్
ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ కేసు
భూవివాదాలకు సంబంధించిన కేసుల నేపథ్యంలో పోలీసుల చర్యలు
ఘట్ కేసర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri District), ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్, అన్నోజిగూడాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు(Senior Congress leader) బాలగోని బాలరాజు గౌడ్‌పై(Balagoni Balaraju Goud) పోచారం ఐటీ కారిడార్ పోలీసులు రౌడీషీట్(Rowdy sheet opened by Pocharam IT Corridor police) తెరిచారు. వరుస నేరారోపణలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఘట్ కేసర్ తహసీల్దార్(Ghatkesar Tahsildar) సంతకాన్ని ఫోర్జరీ(Forgery) చేసి నకిలీ పత్రాన్ని సృష్టించడమే కాకుండా, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై ఇటీవల ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ వ్యవహారంలో పోలీసులు బాలరాజుగౌడ్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కి చెందిన భూమిని కాజేసే ఉద్దేశంతో ఘట్ కేసర్ తహసిల్దార్ సంతకాన్ని పూరి చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సుమారు మూడు నెలల పాటు విచారణ జరిపిన పోలీసులు అన్నోజిగూడకు చెందిన బాలగోని బాలరాజు గౌడ్, బాలగోని సుమన్ గౌడ్, గాదె యాదగిరి పై కేసులు నమోదు చేశారు.
బాలరాజ్ గౌడ్ పై గతంలో ఘట్ కేసర్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు కేసులు నమోదు అయిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. నమోదైన కేసులు, అలాగే తాజాగా ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ తీవ్రమైన అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు, అతని కదలికలపై నిరంతర నిఘా ఉంచేందుకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సమాచారం.