డాక్టరేట్ పట్టా పొందిన సంతోష్ కుమార్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన పరిశోధక విద్యార్థి సంతోష్ కుమార్ కూర పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా పొందారు. తుది వైవా వోస్‌లో ఆయన తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఉమెన్స్ ఆన్లైన్ పర్చేస్ బిహేవియర్ టు అవర్స్ స్మాల్ కిచెన్ అండ్ అప్లై ఇన్సెస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ టిపిబి-టిఏఎం ఫ్రేమ్ వర్క్ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. మహేందర్ మార్గదర్శకత్వం వహించారు.
ఈపరిశోధనలో మహిళలు ఆన్‌లైన్‌లో చిన్న వంటగది ఉపకరణాలను కొనుగోలు చేయడానికి ప్రభావితం చేసే అంశాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఉత్పత్తుల ధర, నాణ్యత, వినియోగ సౌలభ్యం, ఉపయోగకరత, ఆన్‌లైన్ సమీక్షలు వంటి అంశాలు మహిళల కొనుగోలు నిర్ణయాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ ఉట్ల బాలాజీ, విభాగాధిపతి డాక్టర్ వి. విష్ణు వందన, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్ ప్రొఫెసర్ సతీష్ కుమారన్, పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ముత్తా రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికిందర్ బాబా సంతోష్ కుమార్‌ను అలాగే ఆయనకు మార్గదర్శకత్వం వహించిన డాక్టర్ జి. మహేందర్‌ను కూడా అభినందించారు.