చంద్రపురి కాలనీ అభివృద్ధి యే లక్ష్యం
- డివిజన్ అధ్యక్షుడుమల్లెపూల శ్రీకాంత్ యాదవ్
- 14లక్షలతో డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
జవహర్ నగర్, నవంబర్ 5 (విజయక్రాంతి): చంద్రపురి కాలనీ సమగ్ర అభివృద్ధి యే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్(Mallepoola Srikanth Yadav) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ మోహన్ రావు నగర్ కాలనీ లో 14 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ... చంద్రపురి కాలనీ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కారింగుల రాజు గౌడ్, పసుపులేటి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు గోనె చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, అధికార ప్రతినిధి మొగిలిపాక పరశురామ్, కోశాధికారి అశోక్ గుప్తా, సాయి కృష్ణ (మిట్టు), కాలనీ అధ్యక్షులు సార్ల రమేష్, ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, నాయకులు సత్యనారాయణ చారి, సత్య, అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.