పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
ఓటరు జాబితాను పరిశీలించుకోని తప్పులుంటే అభ్యంతరాలు తెలపాలి...
డిప్యూటీ కమిషనర్
మేడిపల్లి, నవంబర్ 25: (విజయక్రాంతి): మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఫారం-5 ముసాయిదా ఓటరు జాబితా(Voter List)ను బుధవారం బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ప్రచురించారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ కార్యాలయ నోటీసు బోర్డుపై ఈ జాబితాను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా పట్టభద్రులు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.
జాబితాలో పేర్లు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఏవైనా అభ్యంతరాలు ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత ఆధారాలతో సర్కిల్ కార్యాలయంలో క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ సమర్పించాలని తెలిపారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ విభాగం ఇన్చార్జి మోహన్ కృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.