OTTలోకి ‘ఆదర్శ కుటుంబం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

22-11-2026 | 01:15pm

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’ ఇప్పుడు OTT ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే Mixed Talk అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ Digital Streaming గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 27 నుంచి Netflix వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా Official Confirmation రాలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ డేట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

రూ.100 కోట్ల లాటరీ.. కుటుంబం చుట్టూ ప్రమాదం!

ఈ సినిమాలో చిట్టిబాబు అనే సాధారణ ప్రైవేట్ ఉద్యోగి పాత్రలో వెంకటేశ్ కనిపిస్తాడు. అతని భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం చేస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటుంది. కూతురు సంపూర్ణ ప్రేమ వ్యవహారాలతో తండ్రికి తలనొప్పిగా మారుతుంది. మరోవైపు కొడుకు శర్వ గుండె సమస్యతో బాధపడుతుంటాడు. అతడి ఆపరేషన్‌కు రూ.2 లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెబుతారు. ఇలా కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిట్టిబాబుకు ఉద్యోగం కూడా పోతుంది. ఈ కష్టాల మధ్య అనూహ్యంగా అతడికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బు చేతికి రాకముందే కుటుంబం ఓ విల్లాకు మారుతుంది. అయితే ఈ భారీ మొత్తంపై కన్నేసిన హత్యలు చేసే బీహార్ గ్యాంగ్.. కారు డ్రైవర్, పనిమనిషి వేషాల్లో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. డబ్బు ఇంటికి చేరిన రాత్రి కుటుంబంపై దాడికి దిగేందుకు గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అతడి గతం ఏమిటి? రూ.100 కోట్ల లాటరీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? ఈ కేసును ఎస్పీగా నటించిన నారా రోహిత్ ఎలా దర్యాప్తు చేశాడు? అన్నదే సినిమా కథలోని ప్రధాన ఉత్కంఠ.

మరిన్ని వార్తలు