సర్వజ్ఞ విద్యార్థుల పతకాల పంట

03-11-2026 | 05:05am

32వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో(National-level Karate Championship) సర్వజ్ఞ ది న్యూ జెన్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. సుమన్ షోటోకాన్ స్పో ర్ట్స్ కరాటే అకాడమీ, ఇండియా ఆధ్వర్యం లో ఈ నెల 1వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో సర్వజ్ఞ విద్యార్థులు(Students) ప్రతిభ చాటి విజయాలను అందుకున్నారు.

బి రితిక-అండర్ 12, ఆర్ బృ హతి-అండర్ 12, పి. మౌనిష్  అండర్-14, కె. రుత్విక-అండర్ 12 బంగారు పతకాలు సాధించారు. బి. అఖిర-అండర్ 12, నవ్య అగర్వాల్-అండర్ 12 వెండి పతకాలు సాధించారు. వారిని పాఠశాల ఛైర్మన్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు