రామాయణ సినిమాపై కొత్త వివాదం.. మరాఠీ వెర్షన్ ఏదీ?
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ (Ramayana Movie) చుట్టూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మరాఠీ భాషకు చోటు కల్పించకపోవడంపై ఎన్సీపీ నేత బాబాసాహెబ్ పాటిల్ (NCP Leader Babasaheb Patil) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరాఠీకి శాస్త్రీయ భాష హోదా ఉన్నప్పటికీ చిత్ర బృందం ఆ భాషను విస్మరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో సినిమాలకు భారీ మార్కెట్ ఉన్నప్పటికీ మరాఠీ వెర్షన్‌ను ప్రకటించకపోవడంపై పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరాఠీ ప్రేక్షకులకూ అవకాశం కల్పించాలి!
మరాఠీ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, మహారాష్ట్ర ప్రేక్షకుల అభిరుచులను గౌరవించాలని ఆయన కోరారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలకు (Film Producers) లేఖ రాస్తూ, వీలైనంత త్వరగా మరాఠీ డబ్బింగ్ వెర్షన్‌ను సిద్ధం చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో ‘రామాయణ’ సినిమా భాషా వెర్షన్ల అంశం (Marathi Dubbed Version) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలు ఈ డిమాండ్‌పై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.