గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే పాకెట్ రాకెట్స్!
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్(Pocket Rockets)’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్), నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా, శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పనిచే యనున్నారు. గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని ప్రకటించనున్నారు.