మాస్ మెచ్చే సీతన్నపేట గేట్

29-11-2026 | 05:10am

వేణుగోపాల్ హీరోగా, నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, 8 పీఎం సాయికుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’(Seetannapeta Gate). దర్శకుడు వై రాజ్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు వైఎంఆర్ నిర్మాత. డిసెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీ సముద్ర, హీరో విజయ రామరాజు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో  హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ.. “మాస్ సినిమాల్ని ఇష్టపడే వారందరికీ మా ‘సీతన్నపేట గేట్’ కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రంతో అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నా” అన్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “సీతన్నపేట గేట్’ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఉండదు.

ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. నేను విన్న యదార్థ సంఘటనలకు నా కల్పనను జోడించి తీశాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ అందరూ చర్చించుకునేలా ఉంటుంది” అని తెలిపారు. నిర్మాత వైఎంఆర్ మాట్లాడుతూ.. “భాషా హద్దులు, సరిహద్దులు లేనిదే సినిమా మాధ్యమం. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను కురిపిస్తుంటారు. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు