అచ్చ తెలుగు అందానికి అరుదైన ఆఫర్?
‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ఆర్సీ 17’. నవంబర్ 1న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమాలో రామ్‌చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ క్రేజీ ప్రాజెక్టులో అచ్చ తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి(Telugu actress Satvika Veeravalli) కథానాయికగా ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అర్జున్, మరాఠా అందం భాగ్యశ్రీ బోర్సేలు ఎంపికయ్యారని, వారిపై ఫొటోషూట్ జరిగిందన్న వార్తలూ వచ్చాయి. ఇక సాత్విక వీరవల్లి విషయానికి వస్తే.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమ వుతోంది. ఆ డెబ్యూ సినిమా ఇంకా విడుదల కాకముందే, ఏకంగా రామ్ చరణ్ కాంబో సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పవచ్చు. సుకుమార్ తన చిత్రాల్లో హీరోయిన్ పాత్రల నేటివిటీకి, నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఈ కథా నేపథ్యానికి అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే ముఖం అవసరమని భావించి, పెద్ద స్టార్ హీరోయిన్లను పక్కన పెట్టి మరీ సుకుమార్ ఈ యంగ్ బ్యూటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. సాత్విక అమెరికాలో జన్మించినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు తెలుగు ప్రాంతానికి చెందినవి. చదువులో టాపర్ అయిన ఆమె, అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. చదువు, మోడలింగ్, భారతీయ శాస్త్రీయ నృత్యంలోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. నవంబర్ 1న జరగబోయే చిత్ర పూజా కార్యక్రమాల్లో ఈ క్రేజీ అప్డేట్పై చిత్ర యూనిట్ అధికారి కంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త అధికారి కంగా నిజమైతే, స్టార్ హీరోల సరసన తెలుగు అమ్మాయిలకు అవకా శాలు రావడం అరు దనే తరుణంలో ఇది టాలీవుడ్లో ఒక మంచి పరిణామం గా నిలవనుంది.