మహారాష్ట్ర అభ్యంతరాలకు పరిష్కారం చూపండి
- తుమ్మిడిహట్టి కోసం సమగ్ర వివరాలు సిద్ధం చేయండి
- అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
- బరాజ్ అలైన్‌మెంట్లు, సాంకేతిక అంశాలపై సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్(Tummadihatti Barrage) నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న ముంపు, పర్యావరణ సంబంధిత ఆందోళనలకు సాంకేతి కంగా సమర్థమైన, ఆచరణసాధ్యమైన పరిష్కారాలు రూపొం దించాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆదేశించారు.
ప్రాజెక్టు సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే ఇంజినీరింగ్ మార్పులను పరిశీలించాలన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల జరిగిన చర్చలకు కొనసాగింపుగా.. తుమ్మిడిహట్టి బరాజ్ సాంకేతిక అంశాలు, ప్రతిపాదిత అలైన్‌మెంట్లపై శనివారం మంత్రి ఉత్తమ్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వాస్తవ ముంపు ఎంతో నిర్ధారించాలి..
వివిధ జలాశయ నీటిమట్టాల వద్ద ప్రభావితమయ్యే భూముల విస్తీర్ణాన్ని సమగ్రంగా అంచనా వేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. వాస్తవంగా ఎంత మేర ముంపు ఏర్పడుతుందో నిర్ధారించేందుకు వివరమైన పటాలు సిద్ధం చేయాల న్నారు. నదీ గర్భ ప్రాంతాలు, అటవీ భూ ములు, పర్యావరణ సున్నిత మండలాలు, సంరక్షిత కోర్ ప్రాంతాలు, రెవెన్యూ భూము లు, జనావాసాలను పటాల్లో స్పష్టంగా గు ర్తించాలని ఆయన సూచించారు. మహారాష్ట్ర ఆందోళనలను పరిష్కరించే మార్గాలను ఈ వివరాల ఆధారంగా పరిశీలించాలన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) ఓవీ రమేశ్‌బాబు పాల్గొన్నారు.
మహారాష్ట్ర సీఎంతో చర్చలు..
నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరిచేందుకు తుమ్మిడిహట్టి బరాజ్ పూర్తిస్థాయి జలాశయ నీటిమట్టాన్ని (ఎఫ్‌ఆర్‌ఎల్) 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అక్టోబర్ 26న ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. ఈ ప్రతిపాదనపై చర్చించారు. సుందిళ్ల బరాజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో కూడిన సమగ్ర వ్యవస్థ ద్వారా 77 టీఎంసీల నీటిని మళ్లించి, ఏడు జిల్లాల పరిధిలోని 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ప్రస్తుతం ప్రతిపాదిత 148 మీటర్ల నీటిమట్టం వద్ద నిల్వ సామర్థ్యం 2.182 టీఎంసీలు కాగా, 152 మీటర్లకు పెం చితే అది 5.697 టీఎంసీలకు చేరుతుంది. తద్వారా నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపునకు మించి పెరుగుతుంది. ప్రతిపాదిత 152 మీట ర్ల నీటిమట్టం వద్ద కూడా ముంపు పరిమితంగానే ఉంటుందని ప్రాజెక్టు అంచనాలు సూచిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో పునరావాసం, పునఃస్థాపనకు సంబంధించిన అవసరాలను పరిష్కరించవచ్చని ఈ అంచనాలు పేర్కొంటున్నాయి.
ఈఎన్‌సీ అడ్మిన్‌గా ప్రసాద్‌కు పూర్తి బాధ్యతలు
రాష్ట్ర నీటి పారుదల శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈఎన్సీ (అడ్మిన్)గా పనిచేస్తున్న టీ శ్రీనివాస్ స్థానంలోకే ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత కారణా లతో టీ శ్రీనివాస్ విధుల నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం నీటి పారుదల శాఖలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు ఈఎన్సీ అడ్మిన్‌గా బాధ్యతలను అదనంగా అప్పగించింది. తన సాధారణ విధులతోపాటు ఈ బాధ్యతలను కూడా నిర్వహించా లని ఆదేశిం చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నియామకం కొనసాగుతుం ది. శ్రీనివాస్‌ను అక్టోబర్ 31 సాయం త్రం నుంచి విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది.