అండాల దందా!
- అంతర్రాష్ట్ర పేద మహిళలే టార్గెట్
- ఒక్కసారి అండదానం చేస్తే రూ.20 వేల నుంచి 30 వేల చెల్లింపు
- ఫెర్టిలిటీ సెంటర్లకు రూ.3లక్షలకు అమ్ముతున్న నిందితులు
- హైదరాబాద్‌లోని ప్రకాష్‌నగర్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురంలో స్థావరాలు
- మెరుపు దాడులు చేసిన పోలీసులు
- ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 49 మంది మహిళల గుర్తింపు
- ప్రధాన సూత్రధారి అమిత్ శర్మ, ప్రధాన ఏజెంట్ దుర్గాప్రసాద్ సహా 9 మంది అరెస్ట్
- వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి సీపీ సుమతి
సికింద్రాబాద్/రంగారెడ్డి బ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మహిళల నిస్సహాయతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా, అక్రమ అండాల విక్రయ (ఊసైట్ డొనేషన్) ముఠా ఆటను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు(Malkajgiri Commissionerate Police) కట్టడి చేశారు. ఐవీఎఫ్, సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి అమాయక యువతులు, పేద మహిళలను నగరానికి తరలించి కాసుల కక్కుర్తితో వారి జీవితాలతో చెలగాటమాడుతున్న రాకెట్ గుట్టును రట్టు చేశారు.
ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులతో పాటు మొత్తం తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచా రంతో బేగంపేట, సరూర్ నగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ బృందాలు ఏకకాలంలో సమన్వయంతో ప్రకాష్‌నగర్, ఎర్ర గడ్డ, సరూర్ నగర్, గోపాలపురం తదితర ప్రాంతాల్లోని నాలుగు స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 49 మంది మహిళలను గుర్తించి, రక్షించారు.
వారిలో బేగంపేట నుంచి 31 మంది, సరూర్ నగర్ నుంచి 18 మంది ఉన్నారు. శనివారం బేగంపేట సీపీ క్యాంప్ కార్యాలయంలో మల్కాజిగిరి కమిషనర్ సుమతి వివరాలు వెల్లడించారు. ‘ఈ రాకెట్ వెనుక అత్యంత వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమిత్ శర్మ (44) ఈ దందాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను కోల్‌కతాకు చెందిన నిక్కత్ పర్వీన్ (31)తో కలిసి దాదాపు రెండేళ్లుగా బేగంపేట ప్రకాష్ నగర్లో నెలకు రూ.50 వేల భారీ అద్దె చెల్లిస్తూ ఒక భవనాన్ని అడ్డాగా మార్చుకున్నా డు. వీరికి నాంపల్లికి చెందిన వ్యాపారి ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ (42) తోడై సరూర్ నగర్ కేంద్రంగా మరో ముఠాను నడిపిస్తున్నాడు.
వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద మహిళలను స్థానిక ఏజెం ట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా ట్రాప్ చేసేవారు. ఒక్కసారి అండాలు దానం చేస్తే రూ.20 వేల నుంచి 30 వేల వరకు సులభంగా సంపాదించవచ్చని ఆశచూపేవారు. తీరా వారిని హైదరాబాద్‌కు రప్పించాక నగరంలోని పలు రహస్య వసతి గృహాల్లో ఉంచి, అసలు విషయం బయటకు పొక్కకుండా బం ధించేవారు. నిందితులు ఒక్కో మహిళ ను చి అండాల సేకరణ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా బయట ఫెర్టిలిటీ కేంద్రాల నుంచి రూ.3 లక్షల వరకు దండుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు’ అని సీపీ వెల్లడించారు.
మహిళలకు ప్రమాదకరమైన మాత్రలు
వైద్య ప్రమాణాలు, ప్రాణాల భద్రతను గాలికొదిలేసి ఈ ముఠా నడిపిన దారుణాలు పోలీసుల తనిఖీల్లో వెలుగుచూశాయని సీపీ సుమతి వెల్లడించారు. ‘ఎలాంటి అధికారిక వైద్యుల పర్యవేక్షణ లేకుండానే మహిళ లకు హార్మోన్ల సమతుల్యతను మార్చేసే ప్రమాదకరమైన హ్యూమోగ్ హెచ్‌పీ 150 ఐయూ ఇంజెక్షన్లతో పాటు ప్రిమోలుట్, మె ప్రాట్ వంటి మాత్రలను విచక్షణారహితంగా ఇచ్చినట్లు బయటపడింది. ఘటనా స్థలాల నుంచి ఐదు ఇంజెక్షన్ వయల్స్, సూదులు, సిరంజీలు, భారీగా మందులు, అనుమానాస్పద డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీ నం చేసుకున్నాం.
కనీస పారిశుద్ధ్యం లేని నివాస గృహాల్లో అక్రమంగా బయోమెడికల్ వ్యర్థాలను పారబోస్తూ ప్రజారోగ్యానికి కూడా ముప్పు కలిగించారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టం ప్రకారం ఒక మహిళ తన జీవితకాలంలో పరిమితంగా, స్వచ్ఛందంగా మాత్రమే అండదానం చేయా ల్సి ఉండగా, ఈ ముఠా నకిలీ గుర్తింపు కార్డులు, బోగస్ అఫిడవిట్లను సృష్టించి ఒకే మహిళను పలుమార్లు కేంద్రాలకు తరలించి తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేసినట్టు దర్యాప్తులో తేలింది’ అని చెప్పారు.
ఈ క్రమంలో అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, దుర్గాప్రసాద్తోతో పాటు సికింద్రాబాద్‌కు చెంది న సబ్ ఏజెంట్ రేష్మా ఖాతూన్ (26), ఏఆర్టీ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను (23), జెప్రే ప్రదీప్ (27), బటర్ఫ్లు బయో అండ్ ఏఆర్టీ బ్యాంక్‌లో డాక్యుమెంటేషన్ బాధ్యతలు చూసే విజయ్ భగవాన్ రావు సాలుంకే (46), పాత నేరస్థుడైన క్యాటరింగ్ సరఫరాదారు పంకజ్ సోనీ (52), షేక్ పర్వీన్ (42)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయ్ అనే వ్యక్తికి ఉన్న పరిచయాలు, లైసెన్సుల ఆధారంగా నగరంలోని పలు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలతో లావాదేవీలు నెరిపినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆయా ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపై త్వరలోనే విస్తృత తనిఖీలు చేపట్టనున్నామని, నకిలీ పత్రాలు సమర్పించి ఉల్లంఘనలకు పాల్పడిన ఆస్పత్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై బేగంపేట, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం-2021లోని కఠిన సెక్షన్ల కింద మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. సీపీ సుమతి పర్యవేక్షణలో డీసీపీలు శ్రీధర్, మనోహర్, ఏసీపీలు గోపాల కృష్ణమూర్తి, రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు సైదులు, శివలింగం, శ్రీశైలం, శేఖర్ బృందా లు ఈ రాకెట్‌ను విజయవంతంగా ఛేదించాయి.
ఉమెన్స్ హాస్టల్ వేదికగా వ్యాపారం
ఎల్బీనగర్ సరూర్‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర కాలనీలో ఉన్న శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వేదికగా ఈ వ్యా పారం ప్రధానంగా సాగుతోంది. పేద యువతులకు ఈ హాస్టల్లో వసతి కల్పిస్తున్నారు. ఆ తర్వాత వారి ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని, వేలాది రూపాయలు ఎరగా వేసి నెలనెలా అండాలను సేకరిస్తున్నారు.
గతంలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్ర మ అవయవ, అండాల మార్పిడి కేసుల్లో నిందితులు రోడ్లపై ఉన్న బిచ్చగాళ్లను, నిరాశ్రయులను, నిరక్షరాస్యులైన పేద మహిళ లను వల వేసి తీసుకువెళ్లేవారు. అయితే, చట్టాల పట్ల అవగాహన పెరగడం, పోలీసు నిఘా తీవ్రతరం చేయడంతో ఈ ముఠా లు తమ రూటు మార్చాయి. ఇప్పుడు ఏ కంగా నగరంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, ప్రైవేట్ గరల్స్ మెస్‌లు, డిగ్రీ/పీజీ కాలేజీలను తమ స్థావరాలుగా మార్చుకున్నాయి.