కేసీఆర్ దీక్ష చేసిన చోటనే దీక్షా దివస్
కరీంనగర్లో 29న భారీ సభకు బీఆర్ఎస్ ప్లాన్
కరీంనగర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): కరీంనగర్లో ఈ నెల 29న దీక్షా దివస్(Deeksha Divas) సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్(BRS) సిద్ధమవుతుంది. ఈ నెల 1 నుంచి రైతు గర్జన సభలను నిర్వహించనున్న బీఆర్ఎస్ చివరి సభను ఉద్యమ గడ్డపై నిర్వహించి క్యాడర్లో జోష్ నింపాలని చూస్తున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టమైన నవంబర్ 29 ‘దీక్షా దివస్‘ సందర్భంగా క రీంనగర్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.
2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘తెలంగాణ వచ్చు డో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమై, కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బ యలుదేరిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఏ టా నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహిస్తున్నది. నాడు కేసీఆర్ను పోలీసులు అరెస్ట్ చేసిన కరీంనగర్లోని అలుగునూరు చౌరస్తా ప్రాం తం ఈ సభకు ప్రధాన వేదికగా నిలవనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు.