తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు

29-11-2026 | 05:10am

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘వృషకర్మ’(Vrushakarma). కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడు. డిసెంబర్ 4న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రబృందం శనివారం హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. “ఈ కథ విన్న తర్వాత కార్తీక్ విజన్‌ను నమ్మి ముందుకు వెళ్తున్నా. ఒక పాయింట్ తర్వాత కథ కూడా మర్చిపోయి పూర్తిగా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయా. తను ఏం చెప్తే అది చేశా.

నాకు కార్తీక్ మీద అంత నమ్మకం ఉంది” అన్నారు. డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. “ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉండబోతోంది. ఇది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఫిల్మ్. చాలా కొత్త స్క్రీన్‌ప్లేను ప్రజెంట్ చేస్తున్నాం. అందరూ సర్‌ప్రైజ్ అవుతారు. ‘విరూపాక్ష’ ఒక రకమైన హారర్ సినిమా. ఇది మరో తరహా హారర్ జానర్. ప్రేక్షకులు ఈ సినిమాను మొదటి సెకండ్ నుంచే చూస్తే ఒక ఫ్లోలో వెళ్తుంది. ఎవరూ తొలి పది నిమిషాలను మిస్ కావద్దు” అని తెలిపారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ “ఈ సినిమాలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇందులో దక్ష క్యారెక్టర్ చేయడం జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం. ఈ సినిమా కచ్చితంగా బెంచ్‌మార్క్ అవుతుంది” అని చెప్పింది. ‘కార్తీక్ అద్భుత కథ రాశారు. చైతన్య ఆ కథను బలంగా నమ్మారు. సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అన్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్, డీవోపీ రాగుల్ డీ హెరియన్ కూడా ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు