17న సీపీఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు..
పాత పెన్షన్ అమలు చేయాలి
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్
ములుగు, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారం సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల(CPS Employees) సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల సందర్భంగా నవంబర్ 17న విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ సీపీఎస్ రద్దు హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు కోసం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ 17న ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవు పాటించి, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ధర్మదీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ జిల్లా మహిళ అధ్యక్షురాలు వంగాల వనజ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ వినాయక్, సెక్రటరీ నరేష్, రాజేందర్, సతీష్, సిహెచ్ రవి, సూరయ్య, మక్బూల్ పాషా, నరహరి, సాయి దుర్గ లక్ష్మి, వాసం నారాయణ, వజ్జ నారాయణ, శారద, కల్తీ కృష్ణ మూర్తి, కొత్త రవీందర్ వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.