డి టీ మహేందర్ కు ఘన సన్మానం
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 28, (విజయక్రాంతి): వెంకటాపురం తహసిల్దార్ కార్యాలయంలో(Venkatapuram Tahsildar Office) విధులు నిర్వహించి, ములుగు ఆర్డీవో ఆఫీస్ కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా డీ టీ మహేందర్ ను బుధవారం సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని వెంకటాపురం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మహేందర్ ను శాలువాతో సత్కరించి, ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గంప రాంబాబు మాట్లాడుతూ మహేందర్ ఎంతో నిజాయితీగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారన్నారు.
రైతులు, పేద ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో ఆయన చొరవ చూపారని, ఇలాంటి అధికారులు ప్రజా సేవలో ఉండడం గర్వకారణమన్నారు. కొత్త ప్రాంతంలో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గెడ్డం వివేక్, మంచర్ల నాగేశ్వరావు,బట్ట నాగేందర్, కుశం దుర్గాప్రసాద్, ఎక్కిబోయిన సాయికిరణ్, నెల్లూరు వెంకన్నబాబు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.