బోనమెత్తిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

03-11-2026 | 06:54pm

22వ రోజుకు చేరిన సమ్మె

నాగర్‌ కర్నూల్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ కోరుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పోశమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) స్పందించి సమస్యలు పరిష్కరించాలని జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు