ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా..
50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్..
మహాదేవపూర్ (విజయక్రాంతి): మహాదేవపూర్(Mahadevpur) మండలం బీరసాగర్ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో మహాదేవపూర్ గ్రామానికి చెందిన పోత పెద్దోళ్ల స్వామి మృతి చెందాడు. బీరసాగర్ ఇసుక రిచ్ నుండి ఇసుక లోడ్ తో వస్తున్నా లారీ పోత స్వామిని డికొట్టడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని మృత దేహాన్ని మహాదేవపూర్ ఆసుపత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బంధువులు ఆసుపత్రి చేరుకొని స్వామి మృతదేహాన్ని తమకు సమాచారం ఇవ్వకుండా ఘటన స్థలం నుండి ఆసుపత్రికి ఎలా తరలిస్తారని పోలీసులతో వాగ్వి వాదానికి దిగారు.
ఈ మేరకు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు బంధువులు స్టానికి బిఆర్ఎస్, బిజెపి, నాయకులు కమాన్ వద్ద ధర్నా చేపట్టారు. స్వామి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు చేరుకున్న ఎస్సై సాంబమూర్తి ఎంత నచ్చచెప్పిన కుటుంబసభ్యులు బందువులు ఆందోళనకు దిగారు.ఈసందర్బంగా రెండుగంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మృతినికి భార్య స్వరూప. ఇద్దరు ఆడపిల్లు సాయిశ్రీ. శ్రావణి వున్నారు.