ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
03-11-2026 | 08:03pm
ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): మండలంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై పేద ప్రజల్లో ఆందోళన నెలకొందని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొలేటి నాగేష్(Sweros District General Secretary Goleti Nagesh) అన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
దరఖాస్తుదారుల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడికి తావులేకుండా ప్రతి గ్రామంలో సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.