సీఎం దృష్టికి తీసుకెళ్తా

05-11-2026 | 11:37pm

- ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి(MLA Dr. Kuchukulla Rajesh Reddy) హామీ ఇచ్చారు. గురువారం 24 రోజులుగా కొనసాగుతున్న ఉద్యోగుల నిరవధిక సమ్మె శిబిరాన్ని(Employees Indefinite Strike Camp) సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి సమస్యలను తీసుకెళ్లానని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శ కుమార్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు