ప్రధానోపాధ్యాయుడు మృతి పట్ల సంతాపం..
వెల్దండ నవంబర్ 04 (నాగర్ కర్నూల్ జిల్లా): వెల్దండ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో(Girls' Primary School) ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న భూపతిదాసు రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందారు. ఆయన ప్రతిపట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.. గత కొంతకాలంగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న భూపతిదాసు.
మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాంరెడ్డి, నోడల్ అధికారి రవీందర్ నాయక్, పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి హెచ్ఎంలు సుగుణ,సునీత,, ఉప సర్పంచ్ శ్రీను సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్,ఉపాధ్యాయులు అమర్ సింగ్,, మురళి మనోహర్ రావు,పావిని,తదితరులు పాల్గొన్నారు..