కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన కందనూల్ బాలికల జట్టు.!

18-11-2026 | 09:29pm
  1. అండర్‌-14 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టోర్నీలో ప్రథమ స్థానం
  2. ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై ఘన విజయం

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్‌-14 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో(Under-14 Girls' Kabaddi Tournament) కందనూల్ (నాగర్‌కర్నూల్) జిల్లా జట్టు సత్తా చాటింది. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్‌లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ పోటీల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగేశ్వరరావు విజేత బాలికలను, వారికి శిక్షణ అందించిన పీఈటీలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు