అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: బీసీ జేఏసీ

28-10-2026 | 09:31pm

దామరచర్ల: ఆరుగాలం కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పంటలు సాగు చేసిన రైతులకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్(BC JAC State Convener Jajula Lingam Goud) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

వరి పంట కోతకు వచ్చిన సమయంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భరించిన రైతులకు ఈ పంట నష్టం మరింత ఆర్థిక భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని కోరారు.

మరిన్ని వార్తలు