ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ
దామరచర్ల :నవంబర్ :10: ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు(El Niño conditions) రానున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ(Mandal Agricultural Officer Balakrishna) కోరారు. మండల లోని బొల్లిగుట్ట లో విత్తనోత్పత్తిపై క్షేత్ర దర్శనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.కంది, పెసర, మినుము, శనగ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు.
యాసంగిలో వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలన్నారు.భూగర్భ జలాలను, నీటి వనరులను సంరక్షించాలన్నారు. పంటల మార్పిడి విధానాన్ని పాటించి తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే పంటలను ఎంచుకోవాలన్నారు. వరి కొయ్యలను పొలాల్లో కాల్చకూడదని, పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలసారం తగ్గి కాలుష్యం పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ నరేష్ , సొసైటీ సి ఈ ఓ వెంకట్ రెడ్డి బొల్లిగుట్టతండా రైతులు పాల్గొన్నారు