నేడు మంత్రుల పర్యటన
దామరచర్ల: దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం జరిగే మంత్రుల పర్యటన ను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె నాగునాయక్ పిలుపునిచ్చారు.మంత్రు పర్యటన సందర్భంగా దామరచర్ల లో పార్టీ నాయకులు, కార్యకర్తల తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దామరచర్లలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు హాజరౌతున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షత న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, కాంగ్రెస్ నాయకులు బంటు కిరణ్,గాలం వెంకన్న , పి కోటిరెడ్డి , శ్యామ్ సుందర్ రెడ్డి, జీదెయ్య,అయోధ్య రామిరెడ్డి, మహేష్,సైదిరెడ్డి, పరమేష్,మధు ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.