నేరస్తులకు శిక్షపడేలా నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలి
- అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలి
- ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
- నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
మునుగోడు, అక్టోబరు 28(విజయ క్రాంతి) : నేరస్థులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(Nalgonda District SP Sharath Chandra Pawar) పోలీసు అధికారులును ఆదేశించారు. బుధవారం మునుగోడు పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణను సమీక్షించారు.
స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కౌంటర్, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్నవి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు.
దర్యాప్తులో జాప్యం జరగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో సాక్ష్యాధారాలు సేకరించాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని చెప్పారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, మహిళలపై నేరాల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం,
అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో చండూరు సీఐ రాము, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, మునుగోడు ఎస్‌ఐ శోభన్‌బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.