కుటుంబంతో కలిసి ఓటేసిన సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(AP CM Chandrababu Naidu) నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి 53వ డివిజన్లోని గాదె రామయ్య సీతారామయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.
వేళ ముఖ్యమంత్రి స్వయంగా పోలింగ్లో పాల్గొని తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కుటుంబం ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలనే సందేశాన్ని ఈ సందర్భంగా చాటిచెప్పారు.