అర్నబ్ విధ్వంసం
- ఏపీ, ఒడిశా, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీభత్సం
- తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఎంపీ, జార్ఖండ్‌లో భారీ వర్షాలు
- శ్రీకాకులంలో నీటమునిగిన రైల్వేట్రాక్
- హౌరా మార్గంలో 9 రైళ్లు రద్దు.. 14 దారి మళ్లింపు
- లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
- భారీ విపత్తులో సహాయం చేస్తాం: హోమంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ/అమరావతి/భువనేశ్వర్/కోల్‌కతా, అక్టోబర్ 29: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్(Arnab Cyclone) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల్లో గురువారం విధ్వంసం సృష్టించింది. ఈ మూడు రాష్ట్రాల్లో గురువారం కుంభవృష్టి కురిసింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని గంజాం, గజపతి జిలాల్లో సుమారు 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు, బహుదా, రుషికుల్య నదులు ఉప్పొంగాయి.
ఆకస్మిక వరదలు ముంచెత్తడం తో దాదాపు 500 గ్రామాలు జలమయం అయ్యాయి. జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో భారత కోస్ట్ గార్డ్లు రంగంలోకి దిగి ప్రజలను విమానాల్లో రక్షించారు. శ్రీకాకులంలో రైల్వేట్రాక్ నీటమునగడంతో హౌరా మార్గంలో 9 రైళ్లు రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించారు. ఏపీతో సహా ఆయా తుఫాన్ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఏపీలో 10,000కు పైగా చెట్లు కూలాయి. ఈ భారీ విపత్తు సమయంలో అన్నివిధాలా సహాయం చేస్తామని కేంద్ర హోమంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంత జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి.
సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. తుఫాను వల్ల కూలిపో యిన 10వేలకు పైగా చెట్లను రెస్క్యూ బృందాలు తొలగి స్తోంది. నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే ఆపరేషన్లు, విద్యుత్ ప్రమాదాలను తొలగించడంతోపాటు, కూలిపోయిన చెట్లను, రహదారి అడ్డంకులను తొలగించడానికి, సహాయక, తరలింపు చర్యలకు సహాయపడటా నికి, అగ్నిప్రమాదా లకు స్పందించడానికి బృందాలను మోహరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఒడిశాను ముంచేసిన తుఫాన్
అర్నాబ్ తుఫాను ఒడిశాను నిండి ముంచేసింది. కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో గంజాం జిల్లాలోని 300 గ్రామాలకు పైగా జలమయం అయ్యాయి. దీంతో కోస్టుగార్డు బృందాలు రంగంలోకి దిగి, అక్కడి ప్రజలను విమానాల ద్వారా తరలిస్తున్నారు. ప్రధాన కార్య దర్శి అను గార్గ్ మాట్లాడుతూ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్), ఒడిశా విపత్తు త్వరిత కార్యాచరణ దళం బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేస్తున్నాయని తెలిపారు.
రుషికుల్య నది పొంగిపొర్లి, సమీప పట్టణాలు, గ్రామాలను ముంచెత్తిం ది. గంజాం జిల్లాలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో సోరడ, అస్కా, దిగపహండి బ్లాక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా పొరుగు రాష్ట్రమైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రైలు సేవలకు అంతరాయం కలిగిందని ఆయన తెలిపారు. శ్రీకాకుళంలో ఒక రైల్వే వంతెన నీట మునిగిపోవడంతో, ఇరువైపులా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని గార్గ్ చెప్పారు. జాతీయ రహదారి కొట్టుకుపోవడం, రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో, భారత కోస్ట్ గార్డ్లు రంగంలోకి దిగారని తెలిపారు.
గంజాం జిల్లాలో 546 మి.మీ వర్షాపాతం
గురువారం గంజాం జిల్లాలోని పాత్రపూర్లో 546 మి.మీపైగా, కంధమాల్‌లోని జి.ఉదయగిరిలో 462.4 మి.మీ, సనఖేముండిలో 388 మి.మీ, రైకియాలో 384.8 మి.మీ, సోరాడలో 375 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఎస్ఆర్సీ తెలిపింది. అలాగే చికిటిలో 309.2 మి.మీ, మోహనాలో 307.6 మి.మీ, డారింగ్బాడి, చకపాద్లలో 273 మి.మీ, 249 మి.మీ వర్షపాతం నమోదైంది. గంజాం జిల్లాలో 42,500 మంది, గజపతి జిల్లాలో 20వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
9 రైళ్లు రద్దు, 14 దారి మళ్లింపు
ఒడిశాలోని గంజాం జిల్లాలో రెండు వంతెనల వద్ద ఉప్పొంగిన బహుదా నది ప్రమాద స్థాయిని దాటింది. దీంతో హౌరా మార్గంలో రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో తొమ్మిది రైళ్లు రద్దు కాగా, మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపా రు. భారీవర్షాల వల్ల బహుదా, రుషికుల్య నదులు ఉప్పొంగాయి. దీంతో తూర్పు తీర రైల్వే ప్రకారం, భువనేశ్వర్ కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ ట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ఒడిశా రాజధాని, తెలంగాణలోని సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు ప్రధాన రైళ్లను రద్దు చేశారు.
విశాఖపట్నం డివిజన్లో ఇచ్ఛాపురం మార్గంలో రెండు వంతెనల వద్ద నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడంతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. అలాగే అర్నబ్ ప్రభావంతో గురువారం మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఈ రాష్ట్రాల్లోని తుఫాన్ ప్రభావిత జిల్లాలో శనివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరింది.
ఆదుకుంటాం: అమిత్‌షా
ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాల అనంతరం, తాను ఆ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ విపత్తు నేపథ్యంలో ప్రజల కష్టాలను తగ్గించడానికి అన్ని విధాలా సహాయం అందిస్తామ ని వారికి హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరిం చినట్లు పేర్కొన్నారు. ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అమిత్‌షా తెలిపారు.
- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- దక్షిణ అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం
- రేపు వాయుగుండంగా మారే అవకాశం
- నవంబర్ మొదటి వారంలో ఏపీ వైపు!
అమరావతి, అక్టోబర్ 29: అర్నబ్ తుఫాన్ మరవకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, గురువారం దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో కొత్తగా అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి అల్పపీడన ప్రాంతంగా (డిప్రెషన్) మారి, నవంబర్ మొదటి వారం లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావ రణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఏర్పడి, ఉదయం 11:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయ నించి, రాబోయే 24 గంటల్లో దక్షిణ అం డమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో మరి ంత స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ తర్వాత, పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణాన్ని కొనసా గిస్తూనే, శనివా రం ఆగ్నేయ బంగా ళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఇది అల్పపీ డనంగా మారే అవకా శం ఉంది. అంతేకా కుండా, ఇది మరింత బలపడి, వాయు గుండంగా మారుతుందని పేర్కొ న్నారు. తర్వాతి రెండు రోజుల్లో (నవంబర్ మొదటి వారంలో) పశ్చిమ-వాయవ్య దిశగా ఆం ధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీన్ని గమనాన్ని డాప్లర్ వెదర్ రాడార్ ద్వారా ఐ ఎండీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.