17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నవీన్‌చంద్ర లెవెల్

05-04-2025 12:00 AM

తెలుగు, తమిళ సినిమాల్లో ప్రేక్షకాదరణ పొందిన నటుడు నవీన్‌చంద్ర నుంచి వస్తున్న బహుభాషా చిత్రం ‘లెవెల్’. ‘సిలా నేరంగలిల్’, ‘సిలా మణిధర్గల్’ల వెంచర్‌లో మూడో చిత్రంగా రూపొందుతోందీ సినిమా. తొలి రెండు భాగాల్లో నటించిన రేయాహరి ఈ మూడో భాగంలోనూ కథానాయికగా నటించింది. ఇందులో నవీన్‌చంద్ర పోలీస్‌గా కనిపించనుండగా.. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటించారు.

గతంలో సుందర్ సీ వద్ద కలకలప్పు2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్‌ఖాన్, రేయాహరి నిర్మిస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్; సంగీతం: డీ ఇమ్మాన్; ఎడిటర్: శ్రీకాంత్ ఎన్‌బీ.