calender_icon.png 18 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 704 ఎంట్రీలు

18-12-2025 01:21:33 AM

హైదరాబాద్‌ను ప్రపంచ సినీ పటంలో నిలబెట్టడానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్) ఎంతో దోహదపడుతుందని ఆ వేడుకల నిర్వహణ కమిటీ ప్యాట్రన్, అంకురం సినిమా దర్శకుడు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోందని వెల్లడించారు. 

సృజనాత్మక మేధావులైన నాగేశ్ కుకునూర్, నాజర్, మైథిలి రావు, లీమా దాస్, అలెగ్జాండర్ లియోపో, డాల్టన్, శశి కుమార్ ఈ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. మొదటి ఎడిషన్‌లోనే 704 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. 60 లఘుచిత్రాలను అధికారిక ఎంట్రీలుగా స్వీకరించామని చెప్పారు. మరో 11 చిత్రాలను ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కోసం, ప్రేక్షకులను అలరించడానికి ఐదు క్లాసిక్ సినిమాలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ చలనచిత్ర ఉత్సవం ఈ నెల 19న సాయంత్రం 5.30 గంటలకు ప్రసాద్స్ ఐమాక్స్‌లోని స్క్రీన్4లో లాంఛనంగా ప్రారంభమవుతుందని చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవం 21న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.