calender_icon.png 18 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేవిడ్‌రెడ్డి బ్రిటిష్ వారికి.. ఇండియన్స్‌కూ శత్రువే!

18-12-2025 01:20:14 AM

స్టార్ హీరో మంచు మనోజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘డేవిడ్‌రెడ్డి’.  వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.  దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటి స్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందు తున్న ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయ కుడు మనోజ్ మాట్లాడుతూ.. “మీ అభిమానం ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ‘డేవిడ్ రెడ్డి’ 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ. ఆయన బ్రిటిష్ వారికే కాదు ఇండియన్స్‌కూ శత్రువే.

డేవిడ్‌రెడ్డికి శాంతియుతంగా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఆయన బైక్ పేరు వార్ డాగ్, అతని చేతిలో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్.. ఇవి రెండు డేవిడ్‌రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్య్రం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలనేది డేవిడ్‌రెడ్డి దృక్పథం. హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్‌రెడ్డి కనిపిస్తాడు. ఈ చిత్రంలో రామ్‌చరణ్, శింబు అతిథి పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

కథలో గెస్ట్ రోల్స్‌కు అవకాశం ఉంది. అయితే, మేము ఇప్పటివరకు ఏ హీరోనూ సంప్రదించలేదు. ఆ వివరాలు తర్వాత చెబుతాం” అన్నారు. ‘ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ క్యారెక్టర్‌తో రాసిన స్క్రిప్ట్’ అని డైరెక్టర్ చెప్పారు. “అనేక ఇబ్బం దులు పెట్టిన తర్వాత ఒకరి నుంచి పుట్టుకొచ్చే ఆవేశమే ఈ సినిమా” అని నిర్మాత భరత్ అన్నారు. “మా కొత్త టీమ్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన మనోజ్‌కి థ్యాంక్స్‌” అని నిర్మాత వెంకట్‌రెడ్డి తెలి పారు. చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.