28 February, 2026 | 1:07 PM

Breaking News

లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ   •   అనురాగ్ యూనివర్సిటీ కి ప్రతిష్టాత్మక ఎన్​పీటీఈఎల్ అవార్డు   •   కన్నతల్లిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన తనయుడు   •   నిర్మాణ పనుల్లో భద్రత గాలిలో...!   •   హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ: 15 మందికి గాయాలు   •   మున్సిపల్ వార్డులో పర్యటించిన చైర్మన్ నగేష్ శేట్కార్   •   వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేడుకలు..   •   మాందాపూర్ ప్రాథమిక పాఠశాల జాతీయ స్థాయికి నామినేట్   •   ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే వన్ హెల్త్ ఫార్మసీ ఏర్పాటు   •  

ఈసారి రెబల్ సంక్రాంతే!

18-12-2025 01:23 AM

స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ రిలీజ్ చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ మాట్లాడుతూ.. ‘మా మీద, మా సినిమా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేద’ని అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “రాజాసాబ్ కంటెంట్‌కు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న మాస్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ప్రభాస్ ఎప్పుడూ ఫ్యాన్స్‌ను అలరించేందుకు చాలా కష్టపడతారు.

ఈ సంక్రాంతి రాజాసాబ్‌తో రెబల్ సంక్రాంతి అవుతుంది. సిద్దంగా ఉండండి” అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “రాజాసాబ్’ రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేస్తాం. హైదరాబాద్‌లోని పబ్లిక్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ప్రభాస్ మూవీ రేంజ్‌ను రాజాసాబ్‌తో చూడబోతున్నారు. అభిమానులు కోరుకున్నట్లే జనవరి 8న ప్రీమియర్స్‌లో కలుద్దాం” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. “రాజాసాబ్’ సాంగ్స్ సూపర్బ్‌గా వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ‘సహన సహన’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్‌లో ప్రభాస్ చేసిన సాంగ్, ఆయన డ్యాన్సులు అదిరిపోతాయి” అన్నారు.