వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
28-02-2026 10:44 AM
హైదరాబాద్: తెలంగాణలో మరో మహిళా కానిస్టేబుల్(Constable Divya) ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని దివ్యగా గుర్తించారు. కానిస్టేబుల్ దివ్య వికారాబాద్ జిల్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. దివ్య వికారాబాద్ జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్(Kothapalli Police Station)లో విధులు నిర్వహిస్తోంది. కుటుంబ సభ్యులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.




