17 July, 2026 | 1:37 AM

మంచే జరుగుతుంది..

03-12-2024 02:30 AM

దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న వారిలో మలయా ళం, కన్నడ బ్యూటీలే ఎక్కువ. ఇప్పటి వరకూ ఉన్న ముద్దుగుమ్మలతో ప్రస్తుతం ఆషికా రంగనాథ్ తోడయ్యారు. ఈ కన్నడ భామ తన మాతృభాషలో రూపొందిన ‘క్రేజీ బాయ్’ అనే చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమయ్యారు. నాగార్జున కథానాయకుడిగా రూపొందిన ‘నా సామిరంగ చిత్రం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈ చిత్రంతో ఆషికాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ‘పట్టత్తు అరసన్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కార్తీ సరసన ‘సర్దార్ 2’, చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లోనూ నటించే అవకాశాన్ని ఆషికా దక్కించుకున్నారు. నవంబర్ 29న అమ్మడు నటించిన ‘మిస్ యూ’ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. తుఫాన్ కారణంగా విడుదల వాయిదా పడింది.

దీంతో అమ్మడు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తనకు చిత్రం విడుదల వాయిదా పడటం బాధ కలిగించిందని.. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. ‘మిస్ యూ’ విడుదల వాయిదా పడినా మంచే జరుగుతుందని, ఎక్కువ మంది ప్రేక్షకులకు చిత్రం రీచ్ అవుతుందని ఆషికా పేర్కొన్నారు.