17 July, 2026 | 1:33 AM

నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

17-07-2026 01:33 AM

సాగునీటి ప్రాజెక్టులు, కరువు పరిస్థితులు, మూసీ పునరుజ్జీవంపై చర్చించే అవకాశం

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్య క్షతన రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం మ ధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో అత్యవసర భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, మూసీ పునరుజ్జీవనం ఫేజ్--1 పనులు, వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిం చనున్నారు.

వీటితో పాటు -బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, పొరుగు రాష్ట్రాలకు న్యాయస్థానం నోటీసులు జారీ, అంతర్‌రాష్ట్ర జల వివాదాల  అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల రీ-ఎస్టిమేషన్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమో దం  తెలిపే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనాపరమై న పరిణామాల నేపథ్యంలో క్యాబినేట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.