24 క్రాఫ్ట్స్‌లో స్క్రిప్ట్ ప్రధానం
‘నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్‌లో జరిగాయి. దర్శకుడి గా 25 ఏళ్ల జర్నీ చాలా ఆనందాన్నిచ్చింది. నన్ను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు సినీ దర్శకుడు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నీ కోసం’ సినిమా ఏకంగా ఏడు నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఆ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల విలేకరులతో తన జర్నీ గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
-ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. “నా తొలి సినిమా ఆగిపోవడంతో కలత చెందాను. హీరో రవితేజ ప్రోత్సాహంతో ‘నీ కోసం’ చేశా. ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున నచ్చడంతో నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. ఒక మంచి సినిమా ఆగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నానని రామోజీ రావు నాకు చెప్పా రు. ఆ సినిమాకు మొత్తం ఏడు నంది అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. నా జర్నీలో టాప్ 5 మూవీస్ అంటే.. ‘-ఆనందం’, ‘వెంకీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘ఢీ’ అని చెప్తాను.
‘వెంకీ’ రిరిలీజ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ‘దుబాయ్ శీను’, ‘బాద్ షా’, ‘దూకుడు’.. ఇలా చాలా సినిమాలను అడుగుతున్నారు. ఆ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి కచ్చితంగా అవుతాయి. ‘వెంకీ’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఒక ఫ్రెష్ ఐడియాతో సినిమా చేయబోతున్నా. కథ 70 శాతం సిద్ధమైంది. త్వరలోనే ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తా. ఫిల్మ్ మేకింగ్‌లో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ విషయంలో అప్డేట్ అవుతూ ఉంటా. ‘విశ్వం’ చూసిన వాళ్లకు అది అర్థమవుతుంది.
డ్రైవింగ్ వస్తే కార్‌లో ఎన్ని ఫీచర్స్ ఉన్నా వాడగలం. నిజం చెప్పాలం టే అప్పటి కంటే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీ. అనుభవపూర్వకంగా నేను చెప్పేదేంటంటే.. 24 క్రాఫ్ట్స్‌లో అన్నింటికన్నా ప్రధానమైనది స్క్రిప్ట్. దాన్ని బలంగా చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి” అన్నారు శ్రీను వైట్ల.






