నియంత వస్తున్నాడు!
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి వస్తున్న మరో చిత్రం ‘యూఐ: ది మూవీ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీకృష్ణ, ఇంద్రజిత్ లంకేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా సోమవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. 2040 సంవత్సరంలో సాగే కథతో ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది. గ్లోబల్ వార్మింగ్, కొవిడ్19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం వంటి సమస్యలతో సమాజం ఎటు దారి తీస్తుందో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో ఉపేంద్ర నియంతగా కనిపించనున్నారు. మార్పు, న్యాయం, మంచి భవిష్యత్తు కోసం నిరసనలకు దిగే ప్రజలనుద్దేశించి ‘మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ’ అంటూ ఉపేంద్ర ఎంట్రీ ఇస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.






