15 March, 2026 | 10:30 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

110 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

18-04-2025 12:46 AM

మునిపల్లి, ఏప్రిల్ 17 :మారుతి సుజుకి కార్లో అక్రమంగా రవాణా చేస్తున్న  110 గ్రాముల ఎండు గంజాయిని  మునిపల్లి పోలీసులు గురువారం నాడు కంకోల్  టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ నుండి హైదరాబాద్  వైపు మారుతి సుజుకి కార్ లో నలుగురు  వ్యక్తులు ఎండు గంజాయిని రవాణా చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మారుతి సుజుకి కార్లో వత్సల్ రామ్ శెట్టి, ఆకాష్, అజయ్ దేశముఖ, సోహెల్ ప్రయాణిస్తుండగా  అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 110 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో వారిని విచారించగా బీదర్ లోని ఇర్ఫానీ గల్లీలో ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ రవాణా చేస్తున్నట్లు  ఒప్పుకున్నారు. 

ఈ మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి  ఎస్‌ఐ రాజేష్ నాయక్   తెలిపారు. ఈ సందర్భంగా ఎండు గంజాయిని  రవాణా చేస్తున్న నలుగురుని  పట్టుకోవడంతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడంపై ఎస్‌ఐ రాజేష్ నాయక్ ను  సిబ్బంది గోపాల్, అనీఫ్, పాండు, సంతోష్, భవాని, సునీల్ లను కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్  అభినందించారు.