24 May, 2026 | 1:27 AM

ఈ వారం వార్తల్లో..

24-05-2026 12:04 AM

దీప్కే.. ‘బొద్దింకల’ ధమ్కీ

నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ ఇటీవల సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఆప్’ మాజీ రాజకీయ వ్యూహకర్త అభిజిత్ దీప్కే అయితే.. ఏకంగా కాక్రోచెస్ జనతా పార్టీ అనే పేరుతో ‘ఎక్స్’ ఖాతా, వెబ్‌సైట్ సైతం తెరిచారు. నిఘావర్గాలు తొలగించినప్పటికీ దీప్కే ఇచ్చిన ‘బొద్దింకల’ ధమ్కీ మాత్రం ‘జెన్‌జెడ్’ని ఆకర్షించింది.

‘తులసి’ సీయూ బై!

అమెరికా నిఘా విభాగ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అనూహ్య పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడని, ఈ కష్టసమయంలో భర్తకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని ఆమె చెబుతున్నారు. అసలు కారణం మాత్రం తెంపరి ట్రంప్ విధానాలను ఆమె విభేదించడమేనని శ్వేతసౌధ వర్గాలు కోడై కూస్తున్నాయి.