27 July, 2026 | 3:16 AM

గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు

27-07-2026 02:41 AM

అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం

పత్రాలు లేని 45 వాహనాలు స్వాధీనం

భూత్పూర్, జూలై 26: మున్సిపాలిటీ పట్టణంలోని ఒకటవ వార్డులో ( సిద్దయ్యపల్లి ) డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఆది వారం ఉదయం పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ సోదాలు చేస్తున్న సందర్భంలో సరైన పత్రాలు లేని 45 వాహనాలను గుర్తించామని, అందులో 1 కారు,3 ఆటోలు, 41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 100 మం ది పోలీస్ సిబ్బంది పాల్గొని కాలనీలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 

నేరస్తులు, పాత నేరస్తులను గుర్తించేందుకు వేలిముద్ర ల విశ్లేషణ పరికరం ద్వారా సుమారు వందమంది వ్యక్తులను తనిఖీ చేయగా ఏడు మం ది అనుమానితులను గుర్తించారు. ఎవరైనా కాలనీలో అనుమానితులుగా తిరుగుతే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. కాలనీలో గంజాయి, డ్రెస్ మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం చేస్తే అలాంటి వారిపై  ఎవరైనా పాల్పడితే  మాకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రమణారెడ్డి, భూత్పూర్ సీఐ రామకృష్ణ, వన్ టౌన్ సిఐ అయ్యప్ప, భూత్పూర్ ఎస్త్స్ర నాగన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు.