చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ దంపతులు
13-05-2024 12:20 PM
సిద్దిపేట: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో ఆయన సతీమణి శోభతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఓటు వేసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోందన్నారు. 65 శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ తెలిపారు.




