తెలంగాణలో ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు కోటిన్నర మంది ఓటేశారు. 17 లోక్ సభ స్థానల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50.18 శాతం, మహబూబ్‌నగర్‌లో 45.84 శాతం, నాగర్‌కర్నూల్ పరిధిలో 45.88 శాతం, నల్లగొండలో 48.48 శాతం, జహీరాబాద్ పరిధిలో 50.71 శాతం, భువనగిరిలో 46.49, చేవెళ్లలో 34.56 శాతం, హైదరాబాద్‌లో 19.37 శాతం, కరీంనగర్‌లో 45.11 శాతం, ఖమ్మంలో 50.63 శాతం, మహబూబాబాద్‌లో 48.51, మెదక్‌లో 46.72 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 27.69 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్దపల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91, వరంగల్ పరిధిలో 41.62 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారులు తీరారు. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కోనసాగనుంది.




